రెండు ఎమ్మెల్సీలు గెలిచి తీరాల్సిందే  : ఏఐసీసీ నేత సచిన్ సావంత్

రెండు ఎమ్మెల్సీలు గెలిచి తీరాల్సిందే  : ఏఐసీసీ నేత సచిన్ సావంత్
  • గాంధీ భవన్ లో సంఘటన్ సృజన్ అభియాన్ 

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరుగనున్న  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలనూ గెలిచి తీరాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో సంఘటన్ సృజన్ అభియాన్ ప్రోగ్రామ్​జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య​అతిథిగా పాల్గొని మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

బూత్​స్థాయిలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నెల 25 లోగా పార్టీ మండల కమిటీలను పూర్తి చేయాలని, పార్టీ గ్రామ కమిటీల నియామకం నవంబర్ 30 వరకు కంప్లీట్​చేయాలని ఆదేశించారు. డీసీసీ అధ్యక్షులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, పట్టుదలగా పని చేయాలని పేర్కొన్నారు.